Abdul Rehman Makki: అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహ్‌మాన్ మృతి..! 11 d ago
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహ్‌మాన్ మక్కీ శుక్రవారం గుండెపాటుతో మరణించాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని సహకార సంస్థ జమాత్ ఉద్ దవా వివరించింది. డయాబెటిక్ తీవ్రంగా పెరగడంతో లాహోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేయూడీ ప్రతినిధి మాట్లాడుతూ "ఈ తెల్లవారుజామున మక్కీకి గుండెపోటు రావడంతో చనిపోయాడు" అని పేర్కొన్నారు.